NTV Telugu Site icon

Haryana Elections: హర్యానా సీఎంగా మళ్లీ నయాబే! అధిష్టానం ఆయన వైపే మొగ్గు!

Nayabsinghsaini

Nayabsinghsaini

హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అంచాలన్నీ తల్లకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీ సూపర్ విక్టరీని అందుకుంది.

తాజాగా హర్యానా ముఖ్యమంత్రి ఎవరంటూ జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం పీఠం నుంచి తప్పించి నాయబ్ సింగ్ సైనీ వర్గానికి చెందిన ఓట్లు రాబట్టేందుకు ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ కూర్చోబోట్టింది. అనుకున్నట్టుగానే బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. దీంతో తిరిగి నాయబ్ సింగ్ సైనీనే ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ అగ్ర నేతలంతా ఆయన వైపే ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇదిలా ఉంటే మంగళవారం కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటి వరకు కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఊహించని మలుపుతిరిగింది. అనుహ్యంగా బీజేపీ పుంజుకుంది. దీంతో కాంగ్రెస్ ఖంగుతింది. మ్యాజిక్ ఫిగర్ దాటుకుని బీజేపీ హర్యానాలో తిరిగి హ్యాట్రిక్ అధికారాన్ని నిలబెట్టుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, కాంగ్రెస్ 37 స్థానాలు సొంతం చేసుకున్నాయి.

ప్రధాని మోడీ.. నాయబ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అగ్ర నేతలంతా ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. నయాబ్.. మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2014లో నారాయణ్‌గఢ్‌ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం సీఎంగా పదోన్నతి పొందారు. తాజాగా ఆయన ఆధ్వర్యంలో మరోసారి అధికారాన్ని దక్కించుకున్నారు.