Site icon NTV Telugu

BJP: లోక్‌సభ ఎన్నికల కసరత్తు.. గురువారం 100 మందితో బీజేపీ తొలి జాబితా.!

Pm Modi, Amit Shah

Pm Modi, Amit Shah

BJP: లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల ఢిల్లీ వేదికగా నేతలతో జాతీయ సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలను, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also: Tamil Nadu: ‘‘బురఖా మీ అందమైన ముఖాన్ని దాచిపెడుతోంది’’.. పోలీస్ అధికారి సస్పెండ్..

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలుపాయి. ఈ సారి ఎన్నికల్లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ..ఎన్డీయే కూటమి 400 సీట్లకు పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ సొంతగా 375 స్థానాలు సాధింస్తుందని ప్రధాని మోడీతో పాటు కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అబ్ కీ బార్, 400 పార్’’ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అతను 2014లో 3.37 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందగా.. 2019లో దానిని 4.8 లక్షల మెజారిటీ సాధించారు.. అమిత్ షా 2019 ఎన్నికలలో గాంధీనగర్ నుండి పోటీ చేశారు.

Exit mobile version