Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. డిసెంబర్ 15 నుండి 20 వరకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బెర్లిన్ వెళ్తున్నారు. మరోవైపు, శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
Read Also: Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత కన్నా ‘‘పర్యాటన నాయకుడు’’, ‘‘పార్టీల నాయకుడు’’ అని నిరూపించారని అన్నారు. రాహుల్ గాందీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని విమర్శించారు. ప్రజలు పని మూడ్‌లో ఉంటారు, కానీ ఆయన శాశ్వత సెలవు మోడ్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో అతను జంగిల్ సఫారీలో ఉన్నాడని గుర్తు చేశారు. అతను జర్మనీ వెళ్లి మరోసారి భారత్‌పై విషం కక్కుతాడని పునావాలా అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ విదేశాల్లో సమయం గడుపుతారని, ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆయన పార్ట్ టైమ్, నాన్ సీరియస్ రాజకీయ నాయకుడని అన్నారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో సగం కాలం విదేశాల్లోనే ఉంటారని విమర్శించారు. ప్రతిపక్ష నేత ప్రయాణాలపై బీజేపీ ఎందుకు ప్రశ్నల్ని లేవనెత్తుతోందని అడిగారు. లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని మోడీ వద్ద సమాధానాలు లేవని, ఆయను అవమానించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిప్డడారు.
