NTV Telugu Site icon

Pawan Singh: బీజేపీ నుంచి స్టార్ యాక్టర్ సస్సెండ్.. కారణం ఇదే..

Pawan Singh

Pawan Singh

Pawan Singh: ప్రముఖ భోజ్‌పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్‌ని బీజేపీ సస్పెండ్ చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నందుకు ఆయనను బుధవారం పార్టీ బహిష్కరించింది. గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అసన్‌సోల్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ, నిరాకరించారు. ఈ పరిణామం గతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, పవన్ సింగ్ ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షం రాష్ట్రీ లోక్‌మోర్చా అధినేత, మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా దక్షిణ బీహార్‌లోని కరకత్ ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగడం బీజేపీకి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామంతోనే ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.

Read Also: Uttarpradesh : ప్రియుడి కోసం కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చిన యువతి.. ఈ తర్వాత

‘‘ మీరు ఎన్డీయే అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. మీ చర్య పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. పార్టీ క్షమశిక్షణను ఉల్లంఘించారు.’’ అని బీజేపీ బీహార్ యూనిట్ పవన్ సింగ్‌కి రాసిన లేఖలో పేర్కొంది. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు సామ్రాట్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని లేఖ తెలిపింది. పవన్ సింగ్‌తో పాటు ఆయన తల్లి ప్రతిభా సింగ్ కూడా అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.

దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కరకత్ స్థానానికి జూన్ 1న చివరి దశలో పోలింగ్ జరుగనుంది. అయితే, తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పవన్ సింగ్ పేర్కొన్నారు. గతంలో బీజేపీ పార్టీ అసన్‌సోల్ నుంచి టీఎంసీ నాయకుడు శత్రుఘ్ను సిన్హాపై పోటీకి నిలబెట్టింది. టికెట్ కేటాయించిన తర్వాత ఆయన పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తృణమూల్ నుంచి పెద్ద ఎత్తున పవన్ సింగ్‌పై విమర్శలు రావడంతో ఆయన పోటీ నుంచి వైదొలిగారు.