BJP spreading hatred, Rahul Gandhi criticizes BJP: భారత్ జోడో యాత్రలో మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం ఉదయం ఆయన గురుద్వారా ఫతేగఢ్ సాహిబ్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు. అయితే భారతదేశం సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడిందని అందుకే యాత్ర విజయవంతం అయిందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు వెల్లడించారు. రైతులు, దుకాణదారులు, కార్మికులు, నిరుద్యోగ యువతతో మాట్లాడానని అన్నారు.
Read Also: Zelensky: మూడో ప్రపంచ యుద్ధం ఉండదు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో జెలన్ స్కీ ప్రసంగం..
యాత్రలో భాగంగా భారతదేశంలో అతిపెద్ద సమస్యలు అయిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి పోరాడామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్ర ప్రసంగాలు చేయడానికి కాదని.. ప్రజలు చెప్పేది వినేందుకు అని తెలిపారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో సాగుతోంది. ఆ తరువాత యాత్రలో భాగంగా చివరిగా జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది. అంతకుముందు జనవరి 19న పఠాన్ కోట్ లో భారీ ర్యాలీ జరగనుంది.
గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభం అయింది. జనవరి 30న శ్రీనగర్ లో యాత్ర ముగియనుంది. మిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. మొత్తం 5 నెలల్లో 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగునుంది.