కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన విందులో ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేకు అవమానం జరిగిందంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రాహుల్‌గాంధీ విందులో ఉద్ధవ్, ఆదిత్యకు చివరి సీటులో కూర్చోబెట్టారని విమర్శించారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేవారిని గుర్తుచేశారు. ఉద్ధవ్ థాక్రే ఎప్పుడూ ఢిల్లీ ముందు తలవంచకూడదని మాట్లాడేవారని.. ఇప్పుడేమో ఇండియా కూటమిలో పరిస్థితి మారిపోయిందని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
అయితే దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన ఆరోపణలను సంజయ్ రౌత్ ఖండించారు. టీవీ స్క్రీన్ బాగా చూడటం కోసమే చివరి వరుసలో కూర్చున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. వాస్తవానికి రాహుల్ విందులో ముందు కూర్చున్నట్లు తెలిపారు. ఓట్ల కుట్రపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇస్తున్నారని.. టీవీ స్క్రీన్ కళ్లకు నొప్పిగా ఉండడంతో వెనక్కి వెళ్లి కూర్చున్నట్లు పేర్కొ్న్నారు. ఉద్ధవ్ థాక్రే.. సోనియా, రాహుల్‌తో ఎలా మసులుకున్నారో ఇతర ఫొటోలు చూడాలని పేర్కొన్నారు. బీజేపీ కుట్రలు గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే.. సీట్ల గురించి మాట్లాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా-అజర్‌బైజాన్ శాంతి ఒప్పందం.. 35 ఏళ్ల ఘర్షణకు స్వస్తి
2022లో కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ రావడంతో తిరిగి బీజేపీ నుంచి ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇది కూడా చదవండి: Israeli PM Benjamin: ట్రంప్‌తో డీల్ చేసుకోవడం ఒక ఆర్ట్.. భారత్‌పై నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
