NTV Telugu Site icon

BJP: రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. సీనియర్ న్యాయవాదికి ఛాన్స్

Bjp

Bjp

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇది కూడా చదవండి: Minister Bala Veeranjaneya Swamy: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి..

రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్‌ బిట్టూ (రాజస్థాన్‌ నుంచి), జార్జి కురియన్‌ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్‌ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి కమలం పార్టీ బరిలోకి దింపింది. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సీనియర్‌ అడ్వకేట్‌ మనన్‌ కుమార్‌ మిశ్రాను బీహార్‌ నుంచి బరిలోకి దించింది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: AP Vision Document-2047: ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్..

అభ్యర్థులు వీళ్లే..
కిరణ్‌ చౌధరి – హర్యానా
మమత మొహంత – ఒడిశా
రజీబ్‌ భట్టాచార్జీ – త్రిపుర
సర్దార్‌ రణ్‌వీత్‌ సింగ్‌బిట్టూ – రాజస్థాన్‌
జార్జ్‌ కురియన్‌ – మధ్యప్రదేశ్‌
మిషన్‌ రంజన్‌ దాస్‌, రామేశ్వర్‌ తెలి-అస్సాం (2)
మనన్‌ కుమార్‌ మిశ్రా -బీహార్‌
ధైర్యశిల్‌ పాటిల్‌ – మహారాష్ట్ర