Site icon NTV Telugu

Navneet Kaur Rana: అమరావతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తెలుగు హీరోయిన్..

Navneet Kaur Rana

Navneet Kaur Rana

Navneet Kaur Rana: లోక్‌సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందే తన ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి ఓట్ల షేరింగ్ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ముందే అభ్యర్థులను ప్రకటించి ఇండియా కూటమిని డిఫెన్స్‌లోకి నెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో పలు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ తన ఏడో జాబితాను ప్రకటించింది. ఇద్దరు అభ్యర్థులను పేర్లను వెల్లడించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కర్ణాకట చిత్రదుర్గ నుంచి గోవింద్ కర్జోల్‌ని పోటీలో నిలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, హర్యానా ఉప ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కర్నాల్ నుంచి పోటీ చేయనున్నారు.

Read Also: SRH vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..

పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసిన, అందరికి సుపరిచితమైన నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నవనీత్ భారీ విజయం సాధించారు. పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈసారి బీజేపీ తరుపున ఆమెకే టికెట్ వస్తుందన్న ఊహాగానాలను పార్టీ నిజం చేసింది.

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వమైన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ రాణాతో పాటు ఎమ్మెల్యే రవి రాణాలు పోరాడారు. ముఖ్యంగా ‘హనుమాన్ చాలీసా’ వివాదంతో దేశ రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. వీరిద్దరు ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించడం అప్పుడు సంచలనంగా మారింది. శివసేన కార్యకర్తల బెదిరింపులకు, ప్రభుత్వ బెదిరింపులను తట్టుకుని ఎంవీఏ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని నవనీత్ ఛాలెంజ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత నుంచి బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ, ఆ పార్టీలో చేరారు.

Exit mobile version