Site icon NTV Telugu

Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ

Sting Operation Video

Sting Operation Video

Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపి విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతిపై బీజేపీ అధికార ప్రతినిధులు సుశాంషు త్రివేది, అదేష్ గుప్త మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆ వీడియోలో లిక్కర్ హోల్ సేల్ పంపిణీ చేసిన అమిత్ అరోడా ఉన్నాడు. అతను ఈ స్కాంలో ఉన్న వారి పేర్లను చెప్పాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఎంత మొత్తం మీద డబ్బులు చేతులు మారాయో వివరించాడని అన్నారు బీజేపీ నేతలు

గుజరాత్‌లో అమ్ముతున్న లిక్కర్ ఢిల్లీ నుంచే పోతోందని.. పంజాబ్‌లో విక్రయిస్తున్న లిక్కర్ కూడా అక్కడిదేనని తెలిపారు. ఢిల్లీలో ఒబేరాయివ్ హోటల్‌లో కూర్చుని ఈ లిక్కర్ పాలసీ తయారు చేశారని వివరించారు. అరుణ్ పిలై, జస్‌దీప్‌ కౌర్‌ చెడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ ఇంకా కొంత కలిసి ఈ పాలసీ తయారు చేశారన్నారు. కావాలని కొంత మందికి లాభం చేకూర్చేలా ఈ పాలసీ చేశారని.. బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం కొంత మంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ పాలసీ వల్ల వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఉన్నది లిక్కర్ స్కాంలో 9వ నిందితుడని బీజేపీ నేతలు తెలిపారు.

TCS Number One: దటీజ్‌.. టీసీఎస్‌. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌. నంబర్ వన్‌ పొజిషన్‌

ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను ఆప్ పంజాబ్, గోవా ఎన్నికలలో ఖర్చు చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతి వైన్ షాపు దగ్గర నుంచి 5 కోట్లు తీసుకున్నారని తెలిపారు. అవినీతిని అంతం చేస్తా అని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంత లిక్కర్ అవసరమో అంత కాకుండా అంతకు మించి సప్లయ్ చేశారని తెలిపారు. బ్లాక్ దందా అంతా ఢిల్లీనుంచి సప్లయ్ అయ్యిందని… దేశంలో వివిధ రాష్ట్రాలకి సప్లయ్ అయ్యిందని ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని విమర్శించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు.

ముఖ్యమంత్రి పదవికికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని.. ఆయన ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి అనర్హుడని అన్నారు. ఆయన బీజేపీపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్నవాళ్ల పేర్లను సీబీఐకి ఇస్తామన్నారు. ఢిల్లీలో ఎవరెవరు కలిశారు.. ఇక్కడికు వచ్చి ఎవరు కలిశారో తమ వద్ద ఆధారులు ఉన్నాయన్నారు. అన్ని విషయాలను కోర్టులో చెప్తామన్నారు.

Exit mobile version