Site icon NTV Telugu

BJP MP: బీజేపీ రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే మృతి

Bjp Mp

Bjp Mp

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే ఈరోజు ఢిల్లీలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు 74 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎంపీ.. ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉయం మరణించారు. 74 ఏళ్ల హరద్వార్‌ దూబే స్వస్థలం ఆగ్రా. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. దూబే బీజేపీలో అనేక పదవులు నిర్వహించారు.
దూబే మరణానికి పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Read also: Jagital Crime: పెళ్లైన ప్రేయసితో టచ్‌లో ప్రియుడు.. గొడ్డలితో నరికిన యువతి బంధువులు

మీరట్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ట్వీట్ చేస్తూ ఆగ్రా రాజకీయాల్లో దూబే చురుగ్గా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసిన దూబే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారని తెలిపారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు.. వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నట్టు ట్విట్ చేశారు. ఫతేపూర్ సిక్రి బిజెపి ఎంపి రాకుమార్ చాహద్ సంతాపం తెలుపుతూ బీజేపీ సీనియర్ నాయకుడు మరియు రాజ్యసభ సభ్యుడు హరద్వార్‌ దూబే మరణం బాధాకరమన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటని.. శ్రీరాముని పాదాల చెంత దూబేకు స్థానం కల్పించాలని కోరుకుంఉన్నట్టు చెప్పారు. ఈ బాధను భరించే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానట్టు ఎంపీ తన సంతాప లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version