Site icon NTV Telugu

BJP: రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతల ఫోటోలతో బీజేపీ పోస్టర్లు..

Ram Mandir 2

Ram Mandir 2

BJP: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలక ఆహ్వానాన్ని ప్రతిపక్ష నేతలు తిరస్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైతే ఆహ్వానాలు తిరస్కరించారో వారిని టార్గెట్ చేస్తూ పోస్టర్ వార్‌కి దిగింది. ఆ పార్టీలు హిందూ వ్యతిరేకులని బీజేపీ ఆరోపించింది. ‘‘ రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించిన సనాతన ప్రత్యర్థుల ముఖాలను గమనించండి’’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.

Read Also: Harish Rao: మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..

ఈ పోస్టర్‌లో కాంగ్రెస్ నేతలతో పాటు వామపక్షాల నాయకులు, ఎస్పీ నేతలు ఇందులో ఉన్నారు. మమతా బెనర్జీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, సీతారం ఏచూరి, అఖిలేష్ యాదవ్, అధిర్ రంజన్ చౌదరి ఫోటోలతో కూడిన పోస్టర్లను బీజేపీ రిలీజ్ చేసింది. తాము వేడుకలు హాజరుకావడం లేదని నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రామాలయ ప్రారంభోత్సవ వేడకు బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌లా ఉందని విమర్శించింది.

Exit mobile version