Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ విరుచుకుపడుతోంది. చైనా దళాలు భారతదేశంలోకి చొచ్చుకువచ్చాయని, ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఆహ్వానం కోసం ప్రధాని మోడీ, జైశంకర్‌ని యూఎస్‌కి పంపించారంటూ సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడటం వివాదాస్పదమైంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు రుజువులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read Also: Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆధారాలు అందించకోతే ఆయనపై ప్రత్యేక హక్కుల నోటీసులు తీసుకువావాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభా హక్కుల తీర్మానం, ఇది హక్కుల్ని దుర్వినియోగం చేయడం లేదా పార్లమెంట్‌ని తప్పుదారి పట్టించే సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రయోగించవచ్చు.
సోమవారం లోక్‌సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మేకిన్ ఇండియా విఫలమైందని, చైనా బలగాలు మన దేశ భూభాగంలో ఉన్నాయని ఆరోపించారు. చైనా మన దేశంలోని 4000 చ.కి.మీ ఆక్రమించిందని, ప్రభుత్వం ఏ భూమిని ఆక్రమించలేదని తప్పుగా చెబుతోందని ఆయన అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కోసం “ప్రధానమంత్రి ఆహ్వానం పొందడానికి” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను అనేకసార్లు అమెరికాకు పంపారని ఆరోపించారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతున్నారని, ఇది రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని అన్నారు.