NTV Telugu Site icon

Delhi Assembly speaker: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా..!

Vijenar Guptha

Vijenar Guptha

Delhi Assembly speaker: ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు తెలిపారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పార్టీ తన నామినేషన్‌ను ధృవీకరించిందన్నారు. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందు ఉంచుతాను అని అన్నారు. అయితే రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడవసారి ఎన్నికైన గుప్తా.. ఇతర బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి, ఆప్ సర్కార్ తన పని తీరుపై 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఇక, కొత్తగా ఏర్పాటైన 8వ ఢిల్లీ అసెంబ్లీలో కమలం పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రతిపక్ష ఆప్‌కు 22 మంది శాసనసభ్యులు ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ను సభ సభ్యులు ఎన్నుకోనున్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: సజ్జల కుటుంబసభ్యుల భూఆక్రమణలపై నేటి నుంచి సర్వే!

ఇదిలాఉంటే.. ఈరోజు రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షాతో పాటు ఎన్డీయే పక్ష సీఎంలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు అధికారులు.