NTV Telugu Site icon

JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..

Jp Nadda

Jp Nadda

JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు కట్టబెట్టారు.

Read Also: Premalu: మలయాళ ‘ప్రేమలు’.. తెలుగోళ్ళు కూడా హైదరాబాద్ ను ఇంత బాగా చూపించలేదు కదరా!

న్యూఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ రెండో రోజు ఈ నిర్ణయం వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వ్యూహాలు చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అమిత్ షా కేంద్రమంత్రి అయ్యాక 2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను చేపట్టారు. నడ్డా 2020లో పూర్తిస్థాయి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు.

జనవరి నెలలో అమిత్ షా మాట్లాడుతూ.. జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగిస్తున్నట్లు చెప్పారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ పలు విజయాలను నమోదు చేసిందని అన్నారు. శనివారం బీజేపీ కౌన్సిల్ మీటింగ్‌లో జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 370 కంటే ఎక్కువ సీట్లను గెలిచేలా, ఎన్డీయేకు 400 సీట్లు దాటేలా బీజేపీ కార్యకర్తలు, నేతలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Show comments