Sonia Gandhi: పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Read Also: NVS-02 NavIC: “నావిక్ శాటిలైట్” క్రాష్ అవుతుందా..? ఎక్కడ విఫలమైంది..? ఇస్రో ఆందోళన..
గంటసేపు ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ..‘‘ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరకు చాలా అలసిపోయారు, ఆమె మాట్లాడటం కష్టంగా ఉంది, పాపం’’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ అత్యున్నత రాజ్యాంగ స్థానాన్ని అవమానించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యల్ని రాష్ట్రపతి కార్యాలయం కూడా తప్పుపట్టింది. ప్రధాని నరేంద్రమోడీ సోనియా గాంధీపై విమర్శలు చేశారు. ‘‘రాజ కుటుంబం (గాంధీ కుటుంబం) నుంచి వేరే వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని దుయ్యబట్టారు.