Site icon NTV Telugu

Jharkhand: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దుబే, మనోజ్‌ తివారీలపై కేసు నమోదు

Bjp Mps

Bjp Mps

Jharkhand: జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టెడ్ ఫ్లెట్‌ను టేకాఫ్‌కు అనుమతి ఇవ్వమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, మనోజ్‌ తివారీలతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవ్‌ఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించగా.. ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ నేతలు టేకాఫ్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ డీఎస్‌పీ సుమ‌న్ అన‌న్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదైంది. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది.

Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్‌ మాత్రమే ఓటు వేయండి

ఎఫ్ఐఆర్‌లో న‌మోదైన వివ‌రాల ప్రకారం ఆగ‌స్ట్ 31న ఎంపీ నిషికాంత్ దూబే, ఆయ‌న కుమారుడు క‌నిష్క్ కాంత్ దూబే, మ‌హికాంత్ దూబే, ఎంపీ మ‌నోజ్ తివారీ, ముఖేష్ పాఠ‌క్‌, దేవ్తా పాండే, పింటు తివారి అనుమ‌తి లేకుండా దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లోని హైసెక్యూరిటీ ప్రాంత‌మైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి త‌మ చార్టర్డ్ విమానానికి క్లియ‌రెన్స్ ల‌భించేలా అధికారుల‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది.

Exit mobile version