NTV Telugu Site icon

BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు

Mp Ravi Kishan

Mp Ravi Kishan

NETIZENS TROLLS RAVI KISHAN ON POPULATION CONTROL BILL: బీజేపీ ఎంపీ, ప్రముఖ భోజ్ పురి నటుడు రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా పలు సినిమాల్లో విలన్ గా రాణించారు. రేసుగుర్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ కు తెలుగులో బాగానే అవకాశాలు వచ్చాయి. బీజేపీ పార్టీలో ఉన్న రవికిషన్ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలను కనకుండా నియంత్రించేలా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడతానని అన్నారు. ప్రస్తుతం భారతదేశం జనాభా విస్పోటనం దిశగా వెళ్తుందని.. ఇలా అయితే మనం ఎప్పటికీ విశ్వగురువులము కాలేమని వ్యాఖ్యానించారు. జనాభాను నియంత్రణ చాలా అవసరం అని.. అందుకే తాను పార్లమెంట్ లో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడతామని..తాను ప్రవేశపెట్టబోయే బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

Read Also: IND Vs WI: నేడు రెండో వన్డే.. టీమిండియా సిరీస్ సాధించేనా?

ఇప్పుడు రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆడుకుంటున్నారు. రవికిషన్ ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రవికిషన్ కు మగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకు ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉందకూడదని చెబుతున్న మీరు చేసిదేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లలను కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్ర బిల్లును పెడతాను అనడం హాస్యాస్పదం అని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. మీరు బిల్లు పెడితే మీకు ఇద్దరు పిల్లలు మాత్రమే దక్కుతారని.. ఎవరో తేల్చుకోవాలని మరో నెటిజెన్ వ్యాఖ్యానించాడు.

Show comments