Site icon NTV Telugu

One Nation One Election: జమిలి ఎన్నికల జేపీసీకి ఛైర్‌పర్సన్‌ నియామకం

Jpc

Jpc

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేయనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తొలుత లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది పేర్లు ప్రకటించారు. మొత్తం 31 మంది పేర్లు వెల్లడించారు. తాజాగా ఈ సభ్యుల సంఖ్యను గురువారం 31 నుంచి 39కి పెంచారు. లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉండనున్నారు. ఈ కమిటీ అధ్యయనం చేసి వచ్చే పార్లమెంట్ సమావేశాల చివరి దినాల్లో రిపోర్టును అందజేయాలని తెలిపింది.

కమిటీ సభ్యులు వీళ్లే..(లోక్‌సభ)
1. పీపీ. చౌదరి
2. సీఎం రమేష్
3. బన్సూరి స్వరాజ్
4. పురుషోత్తం భాయ్ రూపాలా
5. అనురాగ్ సింగ్ ఠాకూర్
6. విష్ణు దయాళ్ రామ్
7. భర్తృహరి మహతాబ్
8. సంబిత్ పాత్ర
9. అనిల్ బలూని
10. విష్ణు దత్ శర్మ
11. ప్రియాంకాగాంధీ
12. మనీష్ తివారీ
13. సుఖ్దేవ్ భగత్
14. ధర్మేంద్ర యాదవ్
15. కల్యాణ్ బెనర్జీ
16. టీఎం సెల్వగణపతి
17. జీఎం హరీష్ బాలయోగి
18. సుప్రియా సూలే
19. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే
20. చందన్ చౌహాన్
21. బాలశౌరి వల్లభనేని

Exit mobile version