Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
- రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారని బీజేపీ ఆరోపణ
- ‘హాలిడే మోడ్‌లో రాహుల్’ అంటూ ప్రదీప్ భండారీ విమర్శలు
- రాహుల్ టార్గెట్‌గా బీజేపీ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అవకతవకలు జరిగాయని భారీ స్థాయిలో ఉద్యమం చేసిన రాహుల్ గాంధీ హఠాత్తుగా వియత్నాం పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు చేసింది.
బీజేపీ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ..బిజినెస్ క్లాస్‌లో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీని పోలి ఉన్నట్లు కనపిస్తున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేసింది. ‘‘అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయా.. కొన్ని రోజులు వియత్నాంలో తిరిగి వస్తా.. ఎవరికి తెలుస్తుంది.?’’ అనే అర్థం వచ్చేలా బీజేపీ రాహుల్ గాంధీపై పోస్టు పెట్టింది.
Also Read
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా రాహుల్ గాంధీ టూర్‌ను ప్రశ్నించారు. ‘‘ఆయన విదేశాలకు ఎందుకు వెళ్లారు? దేశంలో గందరగోళం సృష్టించాలనుకునే భాగస్వాములను కలవడానికి?’’ అనే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ హాలీడే మూడ్‌లో ఉన్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. SIR, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.
”झूठ फैलाते-फैलाते थक गया… कुछ दिन वियतनाम घूम आता हूं… किसी को क्या ही पता चलेगा! 😜”
— BJP (@BJP4India) October 19, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!