Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..

  • రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారని బీజేపీ ఆరోపణ
  • ‘హాలిడే మోడ్‌లో రాహుల్’ అంటూ ప్రదీప్ భండారీ విమర్శలు
  • రాహుల్ టార్గెట్‌గా బీజేపీ సెటైర్లు
Rahul Gandhi (1)

Rahul Gandhi (1)

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అవకతవకలు జరిగాయని భారీ స్థాయిలో ఉద్యమం చేసిన రాహుల్ గాంధీ హఠాత్తుగా వియత్నాం పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు చేసింది.

బీజేపీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ..బిజినెస్ క్లాస్‌లో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీని పోలి ఉన్నట్లు కనపిస్తున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేసింది. ‘‘అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయా.. కొన్ని రోజులు వియత్నాంలో తిరిగి వస్తా.. ఎవరికి తెలుస్తుంది.?’’ అనే అర్థం వచ్చేలా బీజేపీ రాహుల్ గాంధీపై పోస్టు పెట్టింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా రాహుల్ గాంధీ టూర్‌ను ప్రశ్నించారు. ‘‘ఆయన విదేశాలకు ఎందుకు వెళ్లారు? దేశంలో గందరగోళం సృష్టించాలనుకునే భాగస్వాములను కలవడానికి?’’ అనే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ హాలీడే మూడ్‌లో ఉన్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. SIR, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.