కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి.. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్ ల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు యెడియూరప్ప.. అయితే, ఈ మధ్య.. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు.. జాతీయ నాయకత్వం కూడా యెడియూరప్పను సీఎం చైర్ నుంచి దించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.. అయితే, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు నేతలు. మరోవైపు.. యెడియూరప్ప సర్కార్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్.. యెడియూరప్ప పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలందరూ కూడా యోడియూరప్పను వ్యతిరేకిస్తున్నారని, దానిని పార్టీ నాయకత్వం గమనించాలని సూచించారు. అంతేకాదు.. యెడియూరప్పకు వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడం కూడా పాలనకు ఆటంకంగా మారిందని కామెంట్ చేశారాయన.. ఈ విషయంపై పార్టీ కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్‌తో మాట్లాడానని.. యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని స్నేహితులు డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. మొత్తంగా కర్ణాటకలో మరోసారి యెడియూరప్ప సర్కార్‌కు కష్టాలు తప్పేలా లేవు.
సీఎం యెడియూరప్పకు తిప్పలు.. ఆయనను మార్చాల్సిందేనని డిమాండ్
Show comments