NTV Telugu Site icon

Delhi: స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక.. అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల తొలగింపుపై ఆప్ రగడ

Delhiassemblyspaker

Delhiassemblyspaker

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అరవిందర్ సింగ్ లవ్లీ.. విజేందర్ గుప్తా.. స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత అతిషి.. విజేందర్ గుప్తా సీటు దగ్గరకు వెళ్లి అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్‌తో కలిసి ఫొటో దిగారు.

ఇది కూడా చదవండి: Anji Reddy Chinnamile: ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి..

ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సోమవారం తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అరవిందర్ సింగ్ లవ్లీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. అనంతరం మంత్రులు.. ఎమ్మెల్యేలగా ప్రమాణం చేశారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఎన్నికలప్పుడే మోడీకి బీహార్ గుర్తొస్తుంది

ఇక స్పీకర్‌గా విజేందర్ గుప్తా సీటులో ఆశీనులయ్యాక.. ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాలు తొలగించడంపై నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ దళితులంటే గిట్టదు అనడానికి ఇదే ఉదాహరణ అని అతిషి ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక, సిక్కు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు.

స్పీకర్ విజేందర్ గుప్తా స్పందిస్తూ.. ‘‘ఇది మర్యాదపూర్వక ప్రసంగం. మీరు దీనిని రాజకీయ వేదికగా మార్చకూడదు. ప్రతిపక్షం సభ సజావుగా జరగాలని కోరుకోవడం లేదు. ఆప్ సభకు అంతరాయం కలిగించే ఉద్దేశంతో వచ్చింది. సభ గౌరవాన్ని కాపాడండి.’’ అని కోరారు. నిరసనల మధ్య సభను 15 నిమిషాలు స్పీకర్ వాయిదా వేశారు.