Site icon NTV Telugu

India vs China: అరుణాచల్‌ దగ్గర చైనా భారీ డ్యామ్‌ నిర్మాణం.. కేంద్రం కల్పించుకోవాలన్న బీజేపీ ఎమ్మెల్యే..!

Arunachal Pradesh

Arunachal Pradesh

India vs China: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని చైనాతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మెడోగ్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై చైనా 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భారీ డ్యామ్‌ను నిర్మిస్తుంది.. త్సాంగ్పో నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్, అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.

Read Also: Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!

అయితే, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ప్రసంగిస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎరింగ్ మాట్లాడుతూ.. మేము మన పక్క దేశాన్ని నమ్మలేం.. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదు.. చైనా మొత్తం నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా సియాంగ్‌ను ముంచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తైతే భారత్‌పైనే కాకుండా బంగ్లాదేశ్‌పై కూడా దీని ప్రభావంతో వరదలు సంభవించే అవకాశం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ తేల్చి చెప్పారు.

Read Also: Amit Shah: నేడు రాంచీలో కేంద్ర హోంమంత్రి పర్యటన.. కార్యకర్తలతో అమిత్ షా భేటీ..!

అలాగే భారత్, చైనాల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి నీటి ఒప్పందం జరగలేదని సమాచారం. డ్యాం వ్యతిరేకుల నిరసనను ప్రస్తావిస్తూ.. డ్యామ్ నిర్మాణానికి ముందు సంప్రదింపులు జరపాలని, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ సూచించారు. యార్లంగ్ త్సాంగ్పో నదిపై భారీ ఆనకట్ట వల్ల ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా సియాంగ్ నదిపై భారీ బ్యారేజీని నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించిందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ.. గత ఏడాది సెప్టెంబర్‌లో తెలియజేశారు. అధిక నీటిని విడుదల చేస్తే.. వరదల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి పెద్ద నిర్మాణాలు నిర్మించాల్సి ఉంటుందన్నారు. చైనా ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత సియాంగ్ నది పరిస్థితిపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసింది అని చెప్పుకొచ్చారు. నది ప్రవాహాన్ని చైనా మళ్లిస్తే పెద్ద ఎత్తున భూమి కోతకు గురవుతుంది అని సీఎం పెమా ఖండూ పేర్కొన్నారు.

Exit mobile version