Site icon NTV Telugu

Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష

Muzaffarnagar Riots Case

Muzaffarnagar Riots Case

BJP MLA Gets 2 Years In Jail In Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు బీజేపీ ఎమ్మెల్యేకు విక్రమ్ సైనీతో పాటు 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి గోపాల్ ఉపాధ్యాయ అల్లర్లకు పాల్పడినందుకు ఇతర నేరాలకు కలిపి మొత్తం 11 మందిని దోషులుగా నిర్థారించారు. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు.

ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 15 మంది నిందితులకు కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ ఖతౌలీ నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న విక్రమ్ సైనీ అదుపులోకి తీసుకున్నారు. 12 మందిపై ఐపీసీ సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), 353 (ప్రభుత్వ సేవకుడు తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా నేరపూరిత దాడి), 147 (అల్లర్లు), 148 (మారణకాయుధాలతో అల్లర్లు చేయడం), 149 కింద దోషులుగా నిర్ధారించారు.

Read Also: Allahabad High Court: మొదటి భార్యను చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు.

విక్రమ్ సైనీపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు జాట్ యువకుల దహన సంస్కారాలు ముగించుకుని జనం తిరిగి వస్తుండగా కవాల్ గ్రామంలో జరిగిన హింసాకాండ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు 26 మంది వ్యక్తులపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఇద్దరు యువకులు గౌరవ్, సచిన్, షానవాజ్ హత్యలు ఆగస్టు, సెప్టెంబర్ 2013లో ముజఫర్ నగర్, పరిసర ప్రాంతాల్లో మత ఘర్షణలకు కారణం అయ్యాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.

Exit mobile version