BJP MLA Blames Good Roads For Rise In Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడంపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే ఫన్నీ విశ్లేషణ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు మించి రోడ్లే కారణం అని అన్నాడు. రోడ్లు బాగుంటే అధికవేగంగా వాహనాలు వెళ్తాయని.. వాహనాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడపటం కూడా ప్రమాదానికి కారణం అవుతుందని వెల్లడించాడు.
Read Also: Dinosaur Nests: మధ్యప్రదేశ్ నర్మదా లోయలో 256 డైనోసార్ గుడ్లు..
నారాయణ పటేల్ మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని మంధాన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నా నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.. రోడ్లు బాగుండటంతో వాహనాలు అధికవేగంతో నడుస్తున్నాయి… నియంత్రణ కల్పోయే ప్రమాదం ఉంది, కొంతమంది డ్రైవర్లు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు దీంతో ప్రమాదలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితిని నేను కూడా అనుభవించానని ఎమ్మెల్యే అన్నారు.
అధ్వాన్నమైన రోడ్లు తక్కువ రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయా..? అని అక్కడున్న విలేఖరులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ ఏడాది ఒక్క ఖాండ్వా జిల్లాలోనే నాలుగు పెద్ద రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి. 2017 అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రోడ్లు యూఎస్ఏ రోడ్ల కన్నా బాగున్నాయని అన్నారు.