NTV Telugu Site icon

PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్‌షోలో మార్పులు.. కారణమిదే!

Pm Modi Roadshow

Pm Modi Roadshow

BJP Makes Changes To PM Bengaluru Roadshows Over Medical Entrance Exam: నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని.. కర్ణాటక బీజేపీ బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల రోడ్‌షోలో మార్పులు చేసింది. మే 6న విస్తృతమైన ఈవెంట్‌ను, మే 7న స్వల్పకాలిక కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని శుక్రవారం ధృవీకరించారు. ‘‘మే 6, 7 తేదీల్లో ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేము పత్రికల ద్వారా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాము. అయితే.. మే 7న మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్షల గురించి మీడియా మాకు తెలియజేసింది. ఆరోజు చేపట్టే 26 కిమీల రోడ్‌షో.. పరీక్షలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది’’ అని చెప్పారు.

Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం

ఈ పరీక్ష విషయాన్ని తాము పీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లామని, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్‌షో నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారని శోభా తెలిపారు. ఆయన కోరుకున్నట్టుగానే కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశామని అన్నారు. మే 6న 10కిలోమీటర్ల రోడ్ షో ఉంటుందని, మే 7న 26కిమీ ఉంటుందని గతంలోనే చెప్పిన శోభా.. ఇప్పుడు మే 6న బెంగళూరులోని సోమేశ్వర్ భవన్ ఆర్‌బీఐ గ్రౌండ్‌ నుంచి 26 కిలోమీటర్లలో ఒకదానిని సుదూరం నిర్వహిస్తామని చెప్పారు. మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్‌కి దక్షిణం నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య, కెంపేగౌడ విగ్రహం మధ్య తిప్పసంద్ర నుంచి ట్రినిటీ సర్కిల్‌ వరకు 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.

Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి

ఆదివారం రోడ్‌షో జరిగే ప్రాంతంలో ఎక్కువ పరీక్షా కేంద్రాలు లేవని, ఆ ప్రాంతం నుండి ఎవరైనా విద్యార్థులు వస్తే, వారి హాల్ టిక్కెట్లు చూపించి, వారిని పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించామని శోభా వెల్లడించారు. అంతకుముందు శనివారం ఒక్కరోజే ఎనిమిది గంటలపాటు జరగాల్సిన రోడ్‌షోను రెండు భాగాలుగా విభజించారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ర్యాలీని నిర్వహించనున్నారు. ఒకవేళ ర్యాలీ రోజంతా జరిగితే.. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, ఇలా రెండు భాగాలుగా విభజించడం జరిగింది.

Show comments