Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు.
తనను (ఉద్ధవ్) మరియు శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ నాయకులను ఆదేశించారని, అమిత్ షా నాగ్‌పూర్ పర్యటించిన సమయంలో బీజేపీ నాయకులతో మీటింగ్ నిర్వహించారని చెప్పారు. క్లోజ్ డోర్ మీటింగ్‌లో ఆదేశాలు అందాయని అన్నారు. తలుపుల వెన ఎందుకు మాట్లాడాలి..? ప్రజలు ముందు ఈ విషయం చెప్పాలని సవాల్ విసిరారు. మహారాష్ట్ర రామ్‌టెక్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో ఠాక్రే పాల్గొన్నారు.
Read Also: IPL 2025: హార్దిక్‌ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను రాజకీయంగా అంతం చేయాలని అమిత్ షా ఎందుకు అనుకుంటున్నారని.. మహారాష్ట్రను బీజేపీ దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 2014లో శివసేనతో మూడు దశాబ్ధాల పొత్తుని బీజేపీ తెంచుకుందని ఠాక్రే అన్నారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రతిపక్ష నేత్నల్ని వేటాడడాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవన్ ఏకీభవిస్తున్నారా..? అని ఠాక్రే ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికలు అధికారం కోసం కాదని, మహారాష్ట్రని దోచుకోకుండా నిరోధించడానికి చాలా కీలకమని అన్నారు. మహా వికాస్ అఘాడీకి భారీ విజయాన్ని అందించాలని, రామ్ టెక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ) నేతలు సునీల్ కేదార్, అనిల్ దేశ్‌ముఖ్ పాల్గొన్నారు.