Site icon NTV Telugu

Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పటికే దేశాన్ని కుదిపేసింది. వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించిన రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

వైద్యురాలి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. గురువారం కేసు దర్యాప్తును న్యాయస్థానానికి సీబీఐ అందజేసింది. క్రైమ్ సీన్‌ను మార్చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. ఇక బాధితురాలి దహనసంస్కారాలు పూర్తయ్యాక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు

సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్‌కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా ఉంటే.. ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అంతేగాక.. అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్‌మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. శవపరీక్ష జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్‌ సీన్‌ను సీల్‌ చేశారెందుకు? అని కోర్టు ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి: నయన్ ను ఇలా చూస్తే తట్టుకోలేరు సుమీ!!

Exit mobile version