NTV Telugu Site icon

UP: వృద్ధుడిపై బీజేపీ నేత కుమారుడు దాడి.. సీసీకెమెరాలో రికార్డ్

Bjpleader

Bjpleader

ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. 70 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన అతడి భార్యపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్‌

యూపీలోని బీజేపీ నేత, బిజ్నోర్ సదర్ ఛైర్‌పర్సన్ ఇంద్ర సింగ్ కుమారుడు, డాక్టర్ అభినవ్ సింగ్.. జూలై 23న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. వృద్ధుడు బయటకు రాగానే.. మాట్లాడినట్లే మాట్లాడి.. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఇంతలో వృద్ధుడి భార్య వస్తే.. ఆమెపై కూడా దాడికి తెగబడ్డాడు. అక్కడే ఉన్న సీసీకెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దాడి చేయడం సిసిటివిలో రికార్డైంది. క్లినిక్‌లో పని చేస్తున్న నలుగురు, ఐదుగురు వ్యక్తులు వచ్చి అభినవ్ సింగ్‌ను తీసుళ్లారు. దాడి జరగకుండా ఆపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వృద్ధుడిని చంపేస్తానని అభినవ్ సింగ్ బెదిరించాడు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఢిల్లీలో మమత పర్యటన.. సునీతా కేజ్రీవాల్‌కు పరామర్శ