కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించేందుకే రాహుల్‌గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు. విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: IAS Tina Dabi: కలెక్టర్‌ను ‘రీల్ స్టార్’ అంటూ ఎగతాళి.. విద్యార్థులు అరెస్ట్!
రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటన కోసం జర్మనీలోని బెర్లిన్‌లో పర్యటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని ఆరోపించారు. భారత్‌లో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లను ఉపయోగించుకుంటుందని తెలిపారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ కేసుల్లో ఎక్కువ భాగంగా వారిని వ్యతిరేకించే వారిపైనే కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడని బెదిరించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని… దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం తాము గెలిచామని చెప్పారు. భారతదేశంలో ఎన్నికల నిష్పాక్షపాతం జరిగేంత వరకు సమస్యలను లేవనెత్తుతుంటామని తెలిపారు. ఎన్నికల యంత్రాంగంలో సమస్య ఉందని ప్రాథమికంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Vince Zampella: కారు ప్రమాదం.. ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ గేమ్ సృష్టికర్త జాంపెల్లా మృతి
