Site icon NTV Telugu

Navneet Rana: హిందువులు నలుగురు పిల్లల్ని కనాలి.. హిందూస్థాన్ పాకిస్తాన్ కాకూడదు..

Mp Navneet Kaur

Mp Navneet Kaur

Navneet Rana: దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్‌లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది పిల్లలు ఉన్నారని, వారి జనాభా పెరుగుతూనే ఉందని, దానిని ఎదుర్కొవడానికి, హిందుస్థాన్‌ను రక్షించడానికి హిందువులు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలని ఆమె పిలుపునిచ్చారు.

Read Also: Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!

‘‘నేను హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వినండి, ఈ ప్రజలు తమకు నలుగురు భార్యలు, 19 మంది పిల్లలు ఉన్నారని బహిరంగంగా చెబుతున్నారు. మనం కూడా కనీసం మూడు నుండి నాలుగు పిల్లలను కనాలని నేను సూచిస్తున్నాను. మౌలానా లేదా మరెవరో నాకు తెలియదు, కానీ అతడికి 19 మంది పిల్లలు, నలుగురు భార్యలు ఉన్నారని చెప్పాడు. వారు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనడం ద్వారా హిందుస్తాన్‌ను పాకిస్తాన్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనం కేవలం ఒక బిడ్డతో ఎందుకు సంతృప్తి చెందాలి? మనం కూడా ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి’’ అని నవనీత్ రాణా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి పిచ్చి ఆలోచనలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. భారత జనాభా స్థిరంగా ఉండేలా, జననాల రేటు క్షీణతను నివారించేలా భారతీయులు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు.

Exit mobile version