NTV Telugu Site icon

Tamilnadu: వైరల్ వీడియో.. ఓ సారూ.. నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా..!!

Tamilnadu Bjp

Tamilnadu Bjp

Tamilnadu: అప్పుడెప్పుడో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాలో ‘నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా’ అనే పాట మీకు గుర్తుందా.. అయితే ఈ పాట తమిళనాడులోని ఓ బీజేపీ నేతకు సరిగ్గా సరిపోతుంది. బీజేపీ నేత శశికళ పుష్పకు ఆ పార్టీ నేత నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తమిళనాడులో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో బీజేపీ నేత పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించారు. అయితే శశికళ పుష్ప ఈ ప్రయత్నాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత చీర పట్టుకునేందుకూ ట్రై చేశారు. అనంతరం ఆమె టచ్ అయ్యేలా కూడా ప్రయత్నించారు. ఈ తతంగం అంతా ఓ వీడియోలో రికార్డు అయ్యింది.

తాజాగా ఈ వీడియోను డీఎంకే నేత డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యద‌ర్శి ఇసై ద‌క్షిణామూర్తి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. బీజేపీ హయాంలో సొంత పార్టీ నేతలకే రక్షణ లేదంటే దేశ ప్రజలు ఎలా ఉంటారో ఊహించుకోగలమని డీఎంకే విమర్శలకు దిగింది. బీజేపీలో చేరిన మ‌హిళ‌లు ఆ పార్టీ నేత‌ల నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాట‌మే చేస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తమిళనాడులోని రామ‌నాధ‌పురం జిల్లాలో ద‌ళిత నేత ఇమ్మానుయేల్ శేఖ‌ర‌న్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జ‌రిగిన కార్యక్రమానికి శ‌శిక‌ళ పుష్ప హాజ‌రైన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగినట్లు తెలుస్తోంది.

Show comments