NTV Telugu Site icon

BJP: రేపు ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ

Bjp

Bjp

బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. మంగళవారం ‘ఒక దేశం ఒకే ఎన్నికల’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు ఆమోదం పొందాలంటే “129వ రాజ్యాంగ సవరణ బిల్లు”, “1963లో చేసిన “కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు” సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్లులను మొత్తం 32 పార్టీలు సమర్థిస్తుంటే.. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

లోక్‌సభలో బలాబలాలు
ఎన్డీఏ కూటమికి (బీజేపీ 240+మిత్రపక్షాలు 53) మొత్తం 293 స్థానాలు ఉన్నాయి.
బిల్లు ఆమోదం పొందాలంటే 364 సభ్యుల మద్దతు ఉండాలి
అంటే బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి
కానీ ప్రస్తుతం అధికార పార్టీకి సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది

ఇక రాజ్యసభలో బలాబలాలు
రాజ్యసభలో మొత్తం 245 సభ్యులున్నారు
ఎన్డీఏ కూటమికి 112 మంది సభ్యులు ఉన్నారు.
ప్రతిపక్ష (ఇండియా) కూటమికి 85 సభ్యులు ఉన్నారు
ఇక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార పార్టీకి 164 మంది సభ్యులు ఉండాలి
అంటే మూడింట రెండొంతుల బలం కావాలి
ఉభయ సభల్లోనూ అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు. కేవలం సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది.

ఇక జమిలి బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టగానే “సంయుక్త పార్లమెంటరీ కమిటీ” ( జేపీసీ) పరిశీలనకు వెళ్తాయి. అలాగే 23 వ “లా కమిషన్” అభిప్రాయాలను, సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించి, అన్ని పార్టీల మద్దతుతో బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఒకవేళ రెండు బిల్లులు ఆమోదం పొందితే 2029లో దేశంలోని అన్ని చట్ట సభలకు (లోకసభ, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఇదే జరిగితే దేశ రాజకీయ వ్యవస్థకు, రాజకీయాలకు జమిలి ఎన్నికలు సరికొత్త రూపునివ్వనున్నాయి.

Show comments