MP Shatrughan Sinha: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని విపక్షాలను వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. బీజేపీ వారి ప్రతీకారానికి తీరని ప్రయత్నం అని పేర్కొన్నారు. ఎంపీ శత్రుఘ్న సిన్హా .. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో TMC యూత్ ప్రెసిడెంట్ సయోని ఘోష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు పంపింది. ఆయనను ఈడీ 11 గంటల పాటు ప్రశ్నించింది. ఇది ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నమేనని .. ఆరిపోయే ముందు దీపం ఎలా రెపరెపలాడుతుందో.. బిజెపిది కూడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికలు దగ్గర పడుతున్నందున యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఎంపీ అన్నారు. ఇంత కాలం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేకపోయారనీ.. కానీ ఎన్నికల వేళ అకస్మాత్తుగా యూసీసీ గురించి మాట్లాడుతున్నారని.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి దృష్టి మరల్చేందుకు ఈ పనులన్నీ చేస్తున్నారని టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా మండిపడ్డారు.
Read also: Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత
నాలుగేళ్లుగా యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అంశం చర్చనీయాంశంగా ఉంది . మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇది మరోసారి తెరమీదకి వచ్చిందన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ ఇది ఓటు బ్యాంకు రాజకీయంగా అభివర్ణించారు. దేశం రెండు చట్టాలపై నడవదని, రాజ్యాంగంలో ఏకరూప సివిల్ కోడ్ భాగమేనని ప్రధాని మోదీ అంటున్నారు. UCC పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారనీ, దేశంలె రెండు చట్టాలు ఎలా నడుస్తుందని రాజ్యాంగం కూడా దీని గురించి మాట్లాడుతుందని.. సమాన హక్కులు.. యూసీసీని అమలు చేయాలని సుప్రీం కోర్టు కూడా కోరిందని ప్రధాని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాల వ్యక్తులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. రాబోయే ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ UCC అంశాన్ని లేవనెత్తారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
