NTV Telugu Site icon

NCP: “రాముడు శాకాహారి కాదు మాంసం తినేవాడు”.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Jitendra Awadh

Jitendra Awadh

NCP: శ్రీ రాముడిని ఉద్దేశించి ఎన్సీపీ(శరద్ పవార్) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. నాసిక్‌లోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఫైర్ అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరి ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అవద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని ప్రేరేపించాయి.

Read Also: Bandi Sanjay: బండి సంజయ్‌కి BJP కీలక బాధ్యతలు.. కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం

‘‘ రాముడు క్షత్రియుడు, ప్రజలు మమ్మల్ని శాకాహారిగా మార్చాలని అనుకుంటున్నారు. కానీ రాముడు వేటాడి మాంసం తినేవారు. రాముడు మాంసాహరి. 14 ఏళ్ల వనవాసం చేసిన వ్యక్తి శాకాహారం కోసం వెతుకుతాడని మీరు ఎలా అనుకుంటారు..?’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత రామ్ కదమ్ గురువారం మాట్లాడుతూ.. రాముడిని అవమానించినందుకు ఎన్సీపీ నేతపై ఫిర్యాదు చేశారు. అతని వ్యాఖ్యల్ని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి లేఖ రాశారు. జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మాంసం, మద్యాన్ని నిషేధించాలని కోరారు. మరోవైపు రాముడిపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ArrestJitendraAwadh అనే హాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విట్టర్)లో ట్రెండ్ అవుతోంది. అతడిని అరెస్ట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవద్ “శ్రీరామ ద్రోహి” అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.