Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp Focuses On Bihar Assembly Elections

Bihar: బీహార్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ! ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?

Published Date :February 12, 2025 , 2:05 pm
By Suresh Maddala
  • బీహార్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ!
  • ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
Bihar: బీహార్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ! ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నూతనోత్సాహం బీహార్‌లోనూ కొనసాగేలా కేడర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఆ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ చాకచక్యంగా తమ వైపు మలుచుకోగలిగింది. సులువుగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే మాదిరిగా నితీష్ కుమార్ సర్కార్‌పై ఏర్పడిన వ్యతిరేకతను తెలివిగా తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కాషాయ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: West Bengal : మమతా బెనర్జీకి రూ.11 కోట్లకు నోటీసు పంపిన బెంగాల్ గవర్నర్

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎలాగైనా 225 సీట్లు సాధించి తీరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. నితీష్ కుమార్‌తో కలిసి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే ఆర్జేడీ.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఆ అవకాశం తేజస్వీ యాదవ్‌కు ఇవ్వకూడదని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఎలాగైనా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. సీట్ల పంపకాల విషయంలో తేడా రాకుండా నితీష్ కుమార్‌తో చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే జేడీయూ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని చూస్తోంది. దీనికి బీజేపీ ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే కేవలం 43 సీట్లు మాత్రమే సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 110 సీట్లలో 74 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా తక్కువ సీట్లు సాధించినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి కావడం విశేషం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి వెళ్లినా.. కొద్ది రోజులకే తిరిగి బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయా కూటమి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధించింది.

ఇది కూడా చదవండి: Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 225 seats
  • Bihar Assembly Elections
  • BJP eyes
  • BJP focuses
  • Delhi effect

తాజావార్తలు

  • Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!

  • Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్‌గా ట్రీట్‌మెంట్‌..

  • Telangana : ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా.. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే..?

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం.. 2వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా.!

  • AIMIM: ‘‘ఎన్‌కౌంటర్లు చేసే వారిని ఎన్‌కౌంటర్ చేస్తాం’’.. ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions