Hemant Soren: తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎక్స్ (ట్విటర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రజల్లో నాపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ట్రై ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని సంకీర్ణ సర్కార్ గురించి అసత్య ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్ గ్రూప్‌లను సృష్టించిందన్నారు. కానీ, నేను ఝార్ఖండ్ బిడ్డని.. ఈ గడ్డపై ఇలాంటి సంస్కృతికి తావు లేదని పిలుపునిచ్చారు. అలాంటి పనులు ఎప్పటికీ చేయలేనని సీఎం హేమంత్ సోరెన్ చెప్పుకొచ్చారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ ?
ఇక, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కొందరిని ప్రచారానికి కాషాయం పార్టీ తీసుకొచ్చిందని ఝార్ఖండ్ సీఎం ఆరోపించారు. వారితో నాకు వ్యతిరేకంగా మాట్లాడించి.. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తుందన్నారు. ఇందు కోసం ఒక్క నియోజకవర్గంలోనే రూ.కోటికి పైగా ఖర్చు పెట్టంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికల ప్రచారం చేయకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల బాండ్లు, నకిలీ ఔషధాలు, నకిలీ వాక్సిన్లతో మేము ప్రజల జీవితాలతో ఆడుకోలేదని భారతీయ జనతా పార్టీపై ముఖ్యమంత్రి సోరెన్ మండిపడ్డారు.