Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీ “ఎన్నికల హిందువు”.. బీజేపీ విమర్శలు

Rahul Gandhi

Rahul Gandhi

BJP criticizes Rahul Gandhi as Chunav Hindu: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తెల్లటి ధోతీ, నుదిటిపై విభూతి ధరించి మహాకాల్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఆలయాన్ని సందర్శించడంపై బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో హిందువుల ఓట్లను పొందేందుకే రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శిస్తున్నారంటూ విమర్శించింది బీజేపీ. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా.. రాహుల్ గాంధీని ‘ ఎన్నికల హిందువు’గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాహుల్ గాంధీ తన హిందుత్వాన్ని ప్రదర్శిస్తారని విమర్శించారు.

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్, జ్యోతిర్లింగాల ఆయలంలో ఇటీవల పూజలు చేశారు రాహుల్ గాంధీ. ‘‘ ఇది తపస్విలను పూజించే దేశం అని.. గత మూడు నెలలుగా నేను తపస్సు చేస్తున్నానని.. కానీ నిజమైన తపస్విలు రైతులు, కార్మికులు ఇది వారి ముందు చాలా చిన్నది’’ అని బుధవారం రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి ప్రవేశించనుంది.

డిసెంబర్ 1న గుజరాత్ లో మొదటి విడత పోలింగ్ జరనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలిదశలో దక్షిణ గుజరాత్, కఛ్-సౌరాష్ట్ర పరిధిలోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 788 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పార్టీలు బరిలో ఉన్నాయి.

Exit mobile version