కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారనే వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వదంతులను కొట్టిపారేస్తూ కోర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని, అవన్నీ వదంతులేనని, మరో రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా యడ్యూరప్పనే ఉంటారని కర్ణాటక బీజేపీ కోర్ కమిటీ పేర్కోన్నది. నాయకత్వంలో మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఎవరైనా సరే కోర్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో రెండేళ్లలో కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల వరకూ యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు.