BJP Condition Will Be Worse In Rajasthan Than Karnataka Says Pratap Singh Khachariawas: కర్ణాటక ప్రజలు ఏ విధంగా అయితే ఆ రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొట్టారో, అంతకంటే దారుణమైన పరిస్థితిని ఆ పార్టీ రాజస్థాన్‌లో ఎదుర్కుంటుందని కాంగ్రెస్‌కు చెందిన రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కాదు కానీ, మొత్తానికే భూస్థాపిమతం అవుతుందని జోస్యం చెప్పారు. ఇటీవల రాజస్థాన్ అజ్మీర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ఆయన విరుచుకుపడ్డారు. మోడీ ప్రసంగం పూర్తిగా చేవచచ్చినట్లుగా ఉందని, ఎప్పట్లాగే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారే తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పలేదని మండిపడ్డారు. ప్రజలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పకుండా.. ఎప్పుడూ అదే పాత పాడితే ఎలా? అని నిలదీశారు.
Trisha: రేయ్ .. రేయ్ .. ఎవడ్రా.. నువ్వు.. మా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యి వేశావ్
రాజస్థాన్‌లోని తమ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ప్రజలు ఉచిత వైద్యం అందిస్తున్నామని, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులను కలుపుకొని మొత్తం ఒక కోటి మందికి తాము పెన్షన్ కూడా ఇస్తున్నామన్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్స్, విద్యార్థులకు రెండు యూనిఫామ్, మహిళలకు ప్రయాణ టికెట్ ధరల్లో 50% తగ్గింపు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత ప్రయాణం.. వంటివి ఎన్నో కాంగ్రెస్ అందిస్తోందని వెల్లడించారు. బీజేపీ వాళ్లు మాత్రం తాము అధికారంలోకి వస్తే, ఈ పథకాలన్నీ ఆపేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. ‘బీజేపీ నేతలారా.. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌లో మీరు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం’ అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్‌లో ఆ పార్టీ భూస్థాపితం అవ్వడం తథ్యమన్నారు.
Danny Masterson: అత్యాచారం కేసులో హాలీవుడ్ నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
బీజేపీ అవినీతిని ప్రశ్నించినందుకే.. రాహుల్ గాంధీపై వేటు వేశారని ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. అందుకు ప్రతిఫలంగానే.. కర్ణాటక ప్రజలు వారికి బుద్ధి చెప్పారని, రాజస్థాన్‌లో అంతకంటే హీనంగా వాళ్లు ఘోర పరాజయాన్ని చవిచూస్తారని చెప్పారు. కర్ణాటకలో బీజేపీకి కనీసం డిపాజిట్లైనా వచ్చాయని, కానీ రాజస్థాన్‌లో తట్టాబుట్టా సర్దుకొని మొత్తం దుకాణమే ఎత్తేసే దుస్థితి బీజేపీకి తప్పకుండా వస్తుందని ఉద్ఘాటించారు.
