బీజేపీ జాతీయ ప్రతినిధిగా టీవీ జర్నలిస్ట్ ప్రదీప్ భండారి నియమితులయ్యారు. ఈ మేరకు జేపీ నడ్డా మంగళవారం నియమించారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. సెఫాలజీ ఫర్మ్ ‘జన్ కీ బాత్’ వ్యవస్థాపకుడైన ప్రదీప్ భండారి గతంలో రిపబ్లిక్ టీవీ, ఇండియా న్యూస్, జీ న్యూస్ సహా పలు ఛానెల్స్‌లో జర్నిలిస్టుగా పని చేశారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సమయంలో రెగ్యులర్‌గా ఆయన ఎలక్షన్ సర్వేలు నిర్వహిస్తుంటారు. బండారీ నియామకంతో బీజేపీ జాతీయ ప్రతినిధులు 30 మందికి చేరారు.
ఇది కూడా చదవండి: MPDO Venkata Ramana Case: మిస్సింగ్ మిస్టరీ వీడింది.. కానీ, ఎంపీడీవోది ఆత్మహత్యా..? ఇంకా ఏదైనా జరిగిందా..?
బీజేపీ జాతీయ ప్రతినిధిగా నియమించడంపై ప్రదీప్ భండారి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మిషన్ విక్షిత్ భారత్ 2047కి సహకరించడానికి తనకు అవకాశం దక్కిందని చెప్పారు.
BJP chief JP Nadda appoints Pradeep Bhandari as a national spokesperson of the party. pic.twitter.com/tB41E8k7L5
— ANI (@ANI) July 23, 2024
I thank Honorable PM @narendramodi ji for giving me a chance to serve the country, and contribute in his mission of Viksit Bharat 2047.
I thank party president @JPNadda ji, Home Minister @AmitShah ji, National Organization Secretary @blsanthosh ji for giving me the chance to…
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) July 23, 2024