NTV Telugu Site icon

Delhi: ఆప్‌కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం

Delhiaap

Delhiaap

బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు. ఇక తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ సైతం ఓటింగ్‌కి దూరంగా ఉంది. దీంతో పోటీ లేకుండానే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.

ఇది కూడా చదవండి: Maldives president: అక్టోబర్‌లో భారత్‌లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు

బీజేపీ నేత కమల్‌జిత్ షెరావత్ వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఎన్నిక అయ్యారు. దీంతో ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుని పదవికి ఖాళీ ఏర్పడింది. గత గురువారం జరిగిన ఎంసీడీ సమావేశంలో ఎంసీడీ స్టాండిగ్ కమిటీ ఎన్నికను అక్టోబర్ 5వ తేదీకి మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాయిదా వేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వాయిదాను తోసిపుచ్చుతూ శుక్రవారం ఒంటిగంటకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంసీడీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఆరో సీటు ఎన్నికకు ప్రిసైడ్ చేయాలని అడిషనల్ మునిసిపల్ కమిషనర్ జితేంద్ర యాదవ్‌ను ఆదేశించారు. అయితే ఇంత స్వల్ప వ్యవధిలో ఎన్నికకు ఆదేశాలివ్వడం చట్టవిరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఎన్నికలు జరపాలని మేయర్ ఒబెరాయ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ఎల్జీ ఆదేశాలకే కట్టుబడి స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికను కమిషనర్ చేపట్టడంతో ఓటింగ్‌కు ఆప్ కౌన్సిలర్లు దూరంగా ఉండిపోయారు. తాజా ఎన్నికతో ఎంసీడీలోని 18 మంది సభ్యుల స్టాడింగ్‌ కమిటిలో బీజేపీ బలం 10కి చేరింది. ఆప్‌కు 8 సీట్ల బలం ఉంది.

ఇది కూడా చదవండి: Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు

లెప్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం.. సభకు ఎప్పుడు 72 గంటలు ఇస్తాం అని చట్టంలో రాసి ఉంది.. ప్రతి కౌన్సిలర్‌కు సమయం కావాలి.. వారి ఉద్దేశాల్లో ఏదో లోపం కనిపిస్తోంది.. ఏదో చేయాలనే కుట్ర కనిపిస్తోంది. అందుకే ఇదంతా చేస్తున్నారు…’’ అని కేజ్రీవాల్ అన్నారు. న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు ఆప్ రెడీ అవుతోంది.