Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పంజాబ్‌లోని ప్రభుత్వ స్కూల్స్ టీచర్లను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని.. వారు ఆప్ కార్యకర్తలుగా మారిపోయి.. ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపణలు చేశారు.
Read Also: Rashmika: నడవలేని స్థితిలో రష్మిక.. ఎయిర్ పోర్టులో వీడియో వైరల్
అయితే, ఇటీవల అమృత్‌సర్ నుంచి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ తెలిపాడు. ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు భద్రతాకు ముప్ప వాటిల్లుతుందని అన్నాడు. పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వాహనాలు వస్తున్నాయి.. వాటిలోని వస్తువులను పోలీసులు తనిఖీ చేయడం లేదు.. అలాగే, పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతో పాటు ఇతర వస్తువులు ఢిల్లీకి చేరుకుంటున్నాయన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని ఈసీని కోరతాను.. ఇక్కడి ప్రజలకు నిజా నిజాలన్నీ తెలుసు.. రాబోయే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం ఖాయమని ప్రవేశ్‌వర్మ జోస్యం చెప్పారు.