Site icon NTV Telugu

Pahalgam Terror Attack: భార్య, కుమారుడితో అమెరికా నుంచి వచ్చాడు.. ఉగ్రదాడిలో కోల్‌కతా టెక్కీ మృతి

Us

Us

అమెరికాకు చెందిన కోల్‌కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్‌కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. మంగళవారం బితాన్ అధికారి భార్య, కుమారుడితో సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ముష్కరులు కాల్పులు జరిపారు. భార్య, కుమారుడి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని వృద్ధ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. కన్నీటి పర్యాంతం అయ్యారు. ఉగ్రవాదులు.. భార్య, కుమారుడి జోలికి రాలేదు. కేవలం బితాన్ మాత్రమే చంపేసి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!

ఇక బితాన్ అధికారి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోహినికి ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని కోల్‌కతా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో కూడా మమత వెల్లడించారు. ‘‘పహల్గామ్‌ ఘటనలో మృతిచెందిన బితాన్ అధికారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. భార్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఓదార్చడానికి మాటలు రావడం లేదన్నారు. భౌతికకాయం ఇంటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.’’ అని మమత వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Pahalgam Attack: పహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళి

పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా కనీసం 26 మంది మరణించారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్నారు.

 

Exit mobile version