Site icon NTV Telugu

Bird Flu: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్.. కడక్‌నాథ్ కోళ్లలో గుర్తింపు..

Bird Flue

Bird Flue

Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు. అధిక ప్రొటీన్లు ఉండే కడక్ నాథ్ కొళ్లలో ఈ వేరియంట్ ను కనుక్కున్నారు. లోహంచల్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా కడక్‌నాథ్ కోళ్లు చనిపోయాయి. ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిఘాను పెంచారు.

Read Also: Wednesday Stotram: విద్య, వివాహం, అభివృద్దికి ఈ స్తోత్ర పారాయణం చేయండి

ప్రభావిత ప్రాంతాల్లో కొళ్లు, బాతుల అమ్మకాలతో పాటు మాంసం అమ్మకాలను నిషేధించారు. బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బొకారో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు అధికారులు. పెద్ద పౌల్ట్రీ ఫారమ్ కోళ్లు, బాతుల నమూనాలను పరిశీలించడానికి ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వ్యాధి సోకిన జోన్‌లో నివసిస్తున్న వ్యక్తుల నమూనాలను సేకరించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు అధికారులు. ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు చికెన్, బాతు మాంసాన్ని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు అధికారులు. మనుషుల్లో ఈ వ్యాధి వస్తే.. తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, జలుబు, కఫంలో రక్తం వంటి లక్షణాలు ఉంటాయి.

Exit mobile version