Site icon NTV Telugu

Bengaluru: రోడ్లపై వివాదం వేళ డీకే.శివకుమార్‌ను కలిసిన కిరణ్ మజుందార్

Dksivakumar

Dksivakumar

బెంగళూరు రోడ్లపై వివాదం తలెత్తిన వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ను బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తన మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా శివకుమార్‌ను ఆహ్వానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.

బెంగళూరు రోడ్లపై కిరణ్ మజుందార్‌తో చర్చించినట్లుగా డీకే.శివకుమార్ తెలిపారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరు రోడ్లపై కిరణ్ మజుందార్ విమర్శలు గుప్పించారు. బెంగళూరు రోడ్లను విదేశీ టూరిస్టులు విమర్శిస్తున్నారంటూ కిరణ్ మజుందార్ క్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుపై వివాదం చెలరేగింది. కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారంటూ చర్చ నడిచింది. మొత్తానికి వివాదం వేళ డీకే.శివకుమార్‌ను కిరణ్ మజుందార్ కలవడంతో వివాదం సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది.

ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వివాహ ఆహ్వాన పత్రిక అందించడమే అయినప్పటికీ.. ఇద్దరి మధ్య బెంగళూరు అభివృద్ధిపైనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నగర అభివృద్ధిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇరువురి మధ్య చర్చ నడిచినట్లుగా సమాచారం. శివకుమార్‌తో భేటీ అనంతరం కిరణ్‌ మజుందార్‌ మీడియాతో మాట్లాకుండానే వెళ్లిపోయారు. డీకే శివకుమార్ మాత్రం తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగళూరు పురోగతి, సృజనాత్మక, రాష్ట్ర అభివృద్ధి మార్గాలపై ఆమెతో చర్చించినట్లు వెల్లడించారు.

 

Exit mobile version