Site icon NTV Telugu

Election Commissioners Bill: వివాదాస్పద ఎలక్షన్ కమీషనర్ల నియామక బిల్లుకి పార్లమెంట్ ఆమోదం..

Ec

Ec

Election Commissioners Bill: అత్యంత వివాదాస్పద చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నిమాయకానికి సంబంధించిన(నియామకం, సర్వీస్ రూల్స్, పదవీకాలం) బిల్లు-2023కి గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలోనే రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, పార్లమెంట్ ఆమోదించినట్లైంది. భారత ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివాధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

గతంలో సుప్రీంకోర్టు తీర్పును విభేదిస్తూ.. ఈ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ని ఎన్నుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఎలక్షన్ కమీషనర్లను ఎంపిక చేస్తుందని తీర్పు ఇచ్చింది.

Read Also: Saree: చీరకట్టు భామను హీరోయిన్ ను చేసిన ఆర్జీవి..శ్రీలక్ష్మీ సతీష్ ‘శారీ ‘పోస్టర్ వైరల్..

ఎన్నికల కమిషన్ల స్వయంప్రతిపత్తిని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. అయితే, తాజాగా కేంద్రం తీసుకువచ్చిన బిల్లు ఈ ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టును దూరంగా ఉంచనుంది. కొత్తబిల్లు భారత ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి తప్పించింది. కొత్త చట్టం ప్రకారం అతని స్థానంలో కేంద్ర మంత్రిని నియమించింది.

సీఈసీ, ఈసీలు వారి పదవీ కాలంతో తీసుకున్న చర్యలకు సంబంధించి చట్టపరమైన చర్యల నుంచి రక్షించే నిబంధనల్లో ముఖ్యమైన సవరణలు చేశారు. కొత్త బిల్లు ప్రకారం.. ప్రస్తుత, మాజీ సీఈసీ, ఈసీకి వ్యతిరేకంగా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిర్వహించడం, లేదా అధికారిక విధులను నిర్వర్తించడంలో వారు తీసుకున్న చర్యల్లో కలుగజేసుకునే అధికారాలు న్యాయస్థానాలను నిషేధించబడ్డాయి.

Exit mobile version