Site icon NTV Telugu

వైరల్‌: డ్రైవర్‌ లేకుండానే దూసుకెళ్లిన బైక్‌..

Driverless bike

Driverless bike

మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ లేకుండానే ఓ బైక్‌ రోడ్డుపై 300 మీటర్లకు పైగా ప్రయాణించింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో బైక్‌ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. డ్రైవర్‌ లేకుండా బైక్‌ దూసుకెళ్లడం ఏంటనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే… వేగంగా వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. కానీ, బైక్‌ మాత్రం 300 మీటర్లు ప్రయాణించి రోడ్డుపై పడిపోయింది. ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్‌ ఢీకొన్న పాదచారుడు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా డ్రైవర్‌ లేకుండా రోడ్డుపై బైక్‌ దూసుకెళ్లిన దృశ్యాలు మాత్రం.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..

Exit mobile version