Site icon NTV Telugu

బీహార్‌లో వింత‌కేసుః క‌ల‌లోకి వ‌చ్చి అత్యాచారం చేస్తున్నాడ‌ని…

బీహార్‌లో ఓ వింత కేసు న‌మోదైంది.  త‌న క‌ల‌లోకి ఓ మాంత్రికుడు వ‌చ్చి అత్యాచారం చేస్తున్నాడ‌ని చెప్పి పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ చేసింది ఓ మ‌హిళ‌.  గ‌తేడాది చివ‌రిలో బీహార్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉండే మ‌హిళ కుమారుడు అనారోగ్యం పాల‌వ్వ‌డంతో ప్ర‌శాంత్ చ‌తుర్వేది అనే మాంత్రికుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజ‌లు చేశాడు.  కానీ, ఆరోగ్యం కుదుట‌ప‌డ‌క‌పోగా, జ‌న‌వ‌రిలో మృతిచెందాడు.  

Read: అక్క‌డ ప‌ది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్‌…

దీనిపై మాంత్రికుడిని నిల‌దీసేందుకు వెళ్ల‌గా, మాంత్రికుడు త‌న‌పై అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నంచాడ‌ని, త‌న కుమారుడే త‌న‌ను ర‌క్షించాడ‌ని తెలిపింది.  ఆ త‌రువాత త‌న క‌ల‌లోకి వ‌చ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.  అయితే, మ‌హిళ ఫిర్యాదు మేర‌కు చ‌తుర్వేదిని పోలీసులు విచారించారు.  ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని చ‌తుర్వేది పోలీసుల‌కు తెలిపాడు. 

Exit mobile version