NTV Telugu Site icon

Bed performance: ‘‘బెడ్ పర్ఫామెన్స్’’ కారణంగా బీహార్ టీచర్లకు జీతం కోత.. మీరు వింటున్నది నిజమే..

Bihar

Bihar

Bed performance: బీహార్ రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క అక్షరం మారితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలోని జాముయిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులకు శాలరీలు కట్ చేశారు. అయితే దీనికి కారణంగా చూపించిన విషయం తెలిసి కంగుతినడం ఖాయం. ‘‘బెడ్ పర్ఫామెన్స్(‘bed performance)’’ కారణంగా వీరు జీతం కోతను ఎదుర్కొన్నారు. అయితే, ‘‘బ్యాడ్ పర్ఫామెన్స్(bad performance) ’’ అని రాయడానికి బదులుగా ఒక్క అక్షరంతో మొత్తం అర్థమే మారిపోయింది. ఒకే పత్రంలో ఇలా 14 సార్లు తప్పులు పునరావృతమయ్యాయి.

Read Also: Hyderabad: ప్రియుడి వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి ప్రియురాలి ఆత్మహత్య

ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో ట్రోల్ అవుతోంది. గత వారం విద్యాశాఖ అధికారులు జాముయులోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే రోజు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారు. ఇంకా చాలా మంది పనితీరు సరిగా లేదని అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం జాముయిలోని విద్యాశాఖ అధికారి(డీఈఓ) 16 మంది ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు లేఖను విడుదల చేశారు. తనిఖీల సమయంలో గైర్హాజరైనందుకు ముగ్గురు ఉపాధ్యాయులు చర్యలను ఎదుర్కొన్నారు. మరో 13 మంది పేలవమైన పనితీరుకు జరిమానా విధించారు. ఫలితంగా ఒక రోజు జీతం కట్ చేశారు.

దీనికి సంబంధించిన సర్య్కులర్ జారీ చేసే సమయంలో మే 22 నాటి అధికారిక ఆర్డర్‌లో ‘‘Bad’’కి బదులుగా ‘‘Bed’’ అని తప్పుగా రాశారు. దీంతో బ్యాడ్ పర్ఫామెన్స్ కాస్త ‘‘బెడ్ పర్ఫామెన్స్’’గా మారింది. దీంతో పూర్తి అర్థమే మారిపోయి పరువు పోయింది. వెంటనే విద్యాశాఖ తప్పును సరిదిద్దుకునేందుకు త్వరితగతిన కరెక్షన్ లెటర్ జారీ చేసింది. దీనిపై విద్యాశాఖ అధికారి రాజేష్ కుమార్‌ని సంప్రదించగా వివరణ ఇవ్వడానికి నిరాకరించారు.